Siddipeta : సెల్ఫీ దిగుతూ చెరువులో పడి ముగ్గురు మృతి

చెరువుగట్టుపై సరదాగా సెల్ఫీలు దిగుతుండగా ముస్తఫా చెరువులో పడిపోయారు. అతడిని రక్షించేందుకు కైసర్, సోహైల్ చెరువులోకి దిగారు. వారికి ఈత రాకపోవడంతో ముగ్గురు కూడా నీటిలో మునిగి చనిపోయారు.

Siddipeta

Siddipeta : సెల్ఫీ సరదాలో పడి యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలకు ప్రయత్నించి మృత్యువాతపడుతున్నారు. తాజాగా సెల్ఫీ సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది. చెరువు దగ్గర సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ యాకత్ పురాకు చెందిన షేక్ కైసర్(28), షేక్ ముస్తఫా(3), జద్గిగిరిగుట్టకు చెందిన అహ్మద్ సోహైల్(17) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసాన్ పల్లిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు.

Youngster Died Taking Selfie : సెల్ఫీ దిగుతూ డిండి ప్రాజెక్టులో పడి యువకుడు మృతి

గురువారం వర్గల్ మండలం సామలపల్లిలోని సామలచెరువు గట్టు సమీపంలోని బంధువుల వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్లారు. చెరువుగట్టుపై సరదాగా సెల్ఫీలు దిగుతుండగా ముస్తఫా చెరువులో పడిపోయారు. అతడిని రక్షించేందుకు కైసర్, సోహైల్ చెరువులోకి దిగారు.

వారికి ఈత రాకపోవడంతో ముగ్గురు కూడా నీటిలో మునిగి చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపేట ఎస్ఐ అరుణ్ పేర్కొంటారు.