Chethana, Vishal, Vijaya (Image Credit To Original Source)
Cherlapally Family Incident: మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే ట్రాక్‌పై కుటంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సూసైడ్ లెటర్ లభ్యమైంది. రైల్వేస్టేషన్‌లో పార్కింగ్ చేసిన విజయశాంతిరెడ్డి కారులో లెటర్ దొరికింది. ”నా జీవితం నాకు నచ్చట్లేదు, బతకాలని ట్రై చేసినా నా వల్ల అవ్వట్లేదు. పిల్లలను వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు. అందుకే వాళ్లని కూడా తీసుకెళ్తున్నా.. నన్ను క్షమించు అమ్మా.. జీవితం నచ్చక మేమే ఆత్మహత్య చేసుకుంటున్నాం..” అని ఆ లేఖలో రాసి ఉంది.
చర్లపల్లి ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఇవాళ తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణం చేసుకున్నారు. మృతులను బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన విజయశాంతి రెడ్డి, విషాల్ రెడ్డి, చైతన్య రెడ్డిగా గుర్తించారు. మృతుల వద్ద ఎలాంటి ప్రయాణ టికెట్లు లేకపోవడంతో పాటు విలువైన వస్తువులు కూడా లభించలేదని జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. విజయశాంతి భర్త కొంతకాలంగా దుబాయ్ లో ఉంటున్నారు. ఆమె సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. ఫ్యామిలీ సూసైడ్ ఘటనలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.
కూతురు విజయశాంతి చేసిన పని తెలిసి ఆమె తల్లి షాక్ కి గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కూతురు ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదన్నారు. దంపతుల మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని ఆమె తెలిపారు.
Also Read: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. 5 టీమ్‌లతో దుండగుల కోసం పోలీసుల గాలింపు.. డీసీపీ ఏం చెప్పారంటే?