కొమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలం హుడికిలి సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పశువులపై పెద్దపులి దాడి చేసింది. నిన్న వేంపల్లి అడవిలోని బైరమ్మగుట్ట సమీపంలో పశువుల మందపై పెద్దపులి దాడి చేసి.. ఓ లేగదూడను అడవిలోకి లాక్కెళ్లింది. చిలపల్లి సమీపంలో పశువుల కాపరిని సైతం తరమింది.
పరుగులు పెట్టి చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు మేకల కాపరి. ప్రస్తుతం హుడికిలి సమీపంలో పెద్దపులి సంచారిస్తున్నట్టు ఫారెస్ట్ సిబ్బంది నిర్ధారించారు. అప్రమత్తంగా ఉండాలని, అడవిలోకి వెళ్లొద్దని సూచనలు చేశారు. మనుషులపై దాడి చేసిన పులి సంచరిస్తోందని ఫారెస్ట్ సిబ్బంది అంటున్నారు. గత కొంత కాలంగా పులి సంచారం స్థానికుల్లో భయాందోళనలు రేపుతోంది.
ఇటీవలే కొమురం భీం జిల్లా సిర్పూర్ మండలంలోనూ పులి టెన్షన్ రేపిన విషయం తెలిసిందే. అది మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల్లోనూ పశువులపై దాడి చేసింది. అనంతరం సిర్పూర్-టీ మండలం ఇటుకల పహాడ్ అడవిలోకి వచ్చింది.
Manchu Manoj : అక్రమాలు ప్రశ్నించినందుకే నాపై దాడి.. మనోజ్ క్లారిటీ..