Tiger Tension : కొమురంభీం జిల్లాలో ఇద్దరిపై దాడి చేసిన పెద్దపులి ఫోటో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో క్యాప్చర్ అయ్యింది. ట్రాప్ కెమెరాల్లో క్యాప్చర్ అయిన చిత్రం పెద్ద పులిదేనని నిర్ధారించారు పిసిసిఎఫ్ చీఫ్ డోబ్రియాల్. మహారాష్ట్ర నుంచి వచ్చిన పెద్దపులిగా నిర్దారించారు. సిర్పూర్(టి) ఫారెస్ట్ లో ఏర్పాటు చేసిన కెమెరాలో పులి చిత్రం క్యాప్చర్ అయ్యింది. ఈ పులి వయసు 4 నుంచి 5 సంవత్సరాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు.
మహారాష్ట్రతో పాటు సిర్పూర్ (టి) లో ట్రాప్ కెమెరాలకు చిక్కిన పులి, ఈ పులి ఒకటే విధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కాగజ్‌నగర్ ఫారెస్ట్ లో 5 పెద్దపులులు అధికారులు భావిస్తున్నారు. మరికొన్ని పులులు మహారాష్ట్ర నుండి రాకపోకలు కొనసాగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. పులుల రాకతో టైగర్ కారిడార్ ఏర్పాటు చేసే యోచనలో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఉంది.
Also Read : మంత్రుల పనితీరుపై ఆరా తీస్తున్న సీఎం రేవంత్.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా మార్పులు, చేర్పులు?