మంచిర్యాల జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం

  • Publish Date - June 4, 2020 / 05:29 PM IST

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి మరోసారి కలకలం రేపింది. శ్రీరామ్ పూర్ ఏరియా జీఎం ఆఫీస్ పరిసరాల్లో పెద్దపులి కనిపించింది. రాత్రి వేల రోడ్డు దాటుతుండగా వాహనదారులు పెద్దపులి దృశ్యాలు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. నెల రోజుల క్రితం చిలాటిగూడ ప్రాంతంలో పులి సంచరించింది. మళ్లీ ఇప్పుడు కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

గత వారం రోజులుగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గోలేజి ఓసీపీ ప్రాంతంలో పెద్దపులి సంచరించింది. అదే విధంగా ఇవాళ తెల్లవారుజామున నుంచి శ్రీరామ్ పూర్ ఏరియాకు సంబంధించిన ఆర్ కే 8 గని వద్ద పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. నేషనల్ హైవేకు 2 కిలో మీటర్ల దూరంలో పెద్దపులి సంచరిస్తున్నదని చెప్పడంతో అటు మైన్స్ కు సంబంధించిన కార్మికులు, పరిసర ప్రాంతాల్లోని కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. 

రెండు పెద్దపులులు వేర్వేరుగా సంచరిస్తున్నాయా లేదా అదే పెద్దపులి ఇక్కడకు వచ్చిందా అని అధికారులు ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులికి సంబంధించినంత వరకు అందరినీ అలర్జ్ చేశారు. ఎవరు కూడా రాత్రి సమయంలో బయటికి రావొద్దని చెప్పారు.