నేడు,రేపు పొడి వాతావరణం

  • Publish Date - January 8, 2019 / 02:34 AM IST

హైదరాబాద్: రాగల 48 గంటల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు చెప్పారు.  రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్ధాయికి చేరుకున్నాయని, సోమవారం అత్యల్పంగా మెదక్ లో 12, ఆదిలాబాద్ , రామగుండంలో 14,హైదరాబాద్లో 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3డిగ్రీలు పెరిగాయి. తూర్పు భారతదేశం నుంచి వీస్తున్న చలి తీవ్రత కాస్త తగ్గు ముఖం పట్టిందని, మరో 3 రోజుల తరువాత చలితీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని  వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు