Revanth Criticized CM KCR : మోదీ కోసం కేసీఆర్..కేసీఆర్ కోసం బీజేపీ : రేవంత్ రెడ్డి

జీతాలు ఇవ్వకుండా వీఆర్ఏలను కేసీఆర్ వేధిస్తున్నారని మండిపడ్డారు. మోదీ కోసం కేసీఆర్..కేసీఆర్ కోసం బీజేపీ పని చేస్తున్నాయని ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

Revanth Criticized CM KCR : కేసీఆర్ పెట్టే కొత్త పార్టీలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి పార్టీ విలీనం చేస్తారా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఒక్కకరినీ కేసీఆర్ కలవరన్నారు. జగన్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్, ఏక్ నాథ్ షిండేలను కలవరని పేర్కొన్నారు. మోదీ కోసం కేసీఆర్..కేసీఆర్ కోసం బీజేపీ పని చేస్తున్నాయని ఆరోపించారు. అస్సాం సీఎంకు వారి రాష్ట్రంలో గణేష్ నిమజ్జనం లేదా అని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వకుండా వీఆర్ఏలను కేసీఆర్ వేధిస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు కర్ణాటక మాజీ సీఎం, జనతాదళ్ సెక్యులర్ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామితో ప్రగతిభవన్‌లో ఇవాళ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఉదయం ఓ హోటల్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన ఆయన.. తర్వాత ప్రగతిభవన్‌ వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. జాతీయ రాజకీయాలతో పాటు.. బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం బిహార్ సీఎం నితీష్‌కుమార్‌ని సీఎం కేసీఆర్‌ పాట్నా వెళ్లి కలిశారు.

CM KCR Meeting With Kumaraswamy : సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ..నేషనల్ పార్టీ ఏర్పాటుపై చర్చ!

ఇటు హైదరాబాద్‌లో జాతీయ రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. వరుస భేటీలు.. కంటిన్యూగా మీటింగులు పెడుతుండడంతో బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా కేసీఆర్‌ నేషనల్ పార్టీని స్థాపించే ప్రయత్నాలు ఖాయంగానే కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారనుందని ఇప్పటికే అనఫీషియల్‌గా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొన్నాళ్లుగా జాతీయ స్థాయి నేతలతో వరుసగా భేటీ అవుతుండటం.. విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కుమారస్వామితో భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్రెండింగ్ వార్తలు