Revanth Reddy : రైతు సంఘర్షణ సభ.. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించారు.

Revanth Reddy : టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వరంగల్ సంఘర్షణ సభలో రైతులపై తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. శుక్రవారం (మే 6) హన్మకొండలో తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. తెలంగాణ అంటే పేగు బంధం.. ఆత్మ గౌరవమని పేర్కొన్నారు. తెలంగాణ అంటే ఎన్నికల ముడి సరుకు కాదన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా, చేసే వారిపై పీడీ యాక్ట్‌ పెట్టి జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షణ రుణమాఫీని అందించనున్నట్టు తెలిపారు.

ఏడాదికి రూ. 15వేల పెట్టుబడి సాయం అందించనున్నట్టు చెప్పారు. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చెప్పారు. పసుపు క్వింటా రూ. 12వేలకు కొనుగోలు చేస్తామని రేవంత్ తెలిపారు. పత్తికి రూ.6,500 గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. క్వింటాల్ వడ్లను రూ.2,500కు కొంటామన్నారు. మొక్కజోన్నను రూ.2,200కు కొనుగోలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. కందులను రూ.6,700 మద్దతు ధర చెల్లిస్తామని రేవంత్ చెప్పారు.

అంతకుముందు.. వరంగల్ గాబ్రియల్‌కు​ స్కూల్‌ గ్రౌండ్‌కు రాహుల్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఓపెన్‌ టాప్‌జీపులో ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లోని సభా ప్రాంగణానికి ర్యాలీగా రాహుల్ బయల్దేరారు. రాహుతో పాటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.   వరంగల్ లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు.

Read Also : Rahul Gandhi : రైతు సంఘర్షణ సభ.. వరంగల్‌ చేరుకున్న రాహుల్ గాంధీ..

ట్రెండింగ్ వార్తలు