×
Ad

Jubilee Hills by-election : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..? ఎంఐఎం మద్దతు ఇస్తుందా..? క్లారిటీ ఇచ్చిన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్

Jubilee Hills by Election జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడిన తరువాత మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు.

Mahesh Kumar Goud

Jubilee Hills by-election : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నగరా మోగింది. సోమవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. షెడ్యూల్ విడుదలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అయితే, బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బరిలోకి దింపింది. దీంతో ఆమె ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారాన్ని కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఉప పోరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు.

Also Read: Jubilee Hills by-election schedule : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మోగిన నగారా.. నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్ తేదీ.. పూర్తి వివరాలు ఇవే..

సోమవారం ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. బీసీకే జూబ్లీహిల్స్ టికెట్ అని క్లారిటీ ఇచ్చారు. ముగ్గురు బీసీలు టికెట్ ఆశిస్తున్నారని, రేపు సీఎంతో చర్చించి అభ్యర్థుల లిస్ట్‌ను ఏఐసీసీకి పంపిస్తామని చెప్పారు. అభ్యర్థి విషయంలో ముగ్గురు ఇంచార్జి మంత్రులు రిపోర్టు ఇచ్చారని, రెండ్రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఉంటుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపపోరులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్ లో బస్తీ యాత్ర చేపడతామని, బస్తీ యాత్రలో ఇంచార్జితో పాటు మంత్రులు పాల్గొంటారని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. స్థానిక పరిస్థితులను బట్టి స్థానిక ఎన్నికల్లో సీపీఐ, జనసమితి పార్టీ నేతలకు టికెట్ ఇస్తామని అన్నారు. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ టికెట్ రేసులో లేడని, గవర్నర్ కోటాలో ఆయన ఎమ్మెల్సీ అవుతారని మహేశ్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు ఇస్తుందో లేదో చూడాలని, సీపీఎం మాకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. రెండు రోజుల్లో మిత్రపక్షాలతో మీటింగ్ పెడతామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.