Revanth Reddy : గోపూజ చేసిన ఓటు వేసిన రేవంత్ రెడ్డి, నాగార్జున సాగర్ ఘటనకు కేసీఆరే కారణమంటూ ఆగ్రహం
ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని..దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.. తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని విమర్శించారు.
- nagamani
- Published On : November 30, 2023 / 10:46 AM IST
Revanth Reddy
Revanth Reddy : గోపూజ చేసిన ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్ రెడ్డి దంపతులు తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్ లో గోపూజ చేసిన రేవంత్ తన భార్యతో కలిసి వెళ్లి ఓటు వేశారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్ ఘటనపై స్పందించారు. పోలింగ్ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారు.
తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. ఏపీ పోలీసులు అర్ధరాత్రి నాగార్జునసాగర్ వద్ద భారీగా మోహరించారు. సాగర్ రైట్ కెనాల్ కు నీటి విడుదల కోసం వచ్చిన ఏపీ పోలీసులు నాగార్జునసాగర్ డ్యామ్‌పై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతు..ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని..దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదున్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని విమర్శించారు. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం ప్రజామోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడటమేనని..ఈ ఎన్నికల్లో గెలిచేది కాగ్రెస్సేనని తాము ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు.
దేశాల మధ్య నీటి వాటాలు పంచుకుంటున్నాం..అటువంటిది అలాంటిది రాష్ట్రాల మధ్య వాటాలు పంచుకోలేమా..నీటి వాటాలు, ఆస్తుల పంపకాల విషయంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంటోంది..? దీనికి పర్మినెంట్ పరిష్కారం అనేది చాలా అవరసరం అన్నారు. ఇలాంటి సమస్యలను కాంగ్రెస్ సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరిస్తుందన్నారు.అవసరమైనప్పుడు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని..రాజకీయ లబ్ది కోసం చేస్తున్న కేసీఆర్ పన్నాగాలు ఇక నుంచి సాగవన్నారు.
కేసీఆర్ వి దింపుడు కల్లం ఆశలేనంటూ ఎద్దేవా చేశారు. ఇటువంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు.వివాదాలను సామరస్యంగా సరైన పరిష్కారం చూపించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.కాగా..పోలింగ్ కొనసాగుతున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. కవిత ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటు ఫిర్యాదు చేసింది.
