హరీశ్‌రావు వెన్నుపోటు అల్లుడు.. కేసీఆర్‌కు షాక్ ఇవ్వడం ఖాయం: జగ్గారెడ్డి

జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక వెపన్, ఒక బ్రాండ్. నా వద్ద 60 కోట్లు ఉంటే సంగారెడ్డిలో మీకు చుక్కలు చూయించేటోన్ని.

Jagga Reddy

Jagga Reddy: తమ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, బీఆర్ఎస్ పార్టీకి ఎలా గుణపాఠం చెప్పాలో తమకు తెలుసునని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ జగ్గారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు హరీశ్‌రావు ఎప్పుడైనా వెన్నుపోటు పొడుస్తారని జోస్యం చెప్పారు. అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే మెదక్ లోక్‌స‌భ స్థానం నుంచి పోటీకి సిద్దమని ప్రకటించారు. ప్రశాంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాలని హితవు పలికారు.

”సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓడిపోయిండు, మా ఎమ్మెల్యేలను ఏం చేస్తావని వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. కాళేశ్వరంలో దోచిన సొమ్ములోంచి 60 కోట్లు హరీశ్‌రావుతో సంగారెడ్డికి పంపించారు. ఆ సొమ్ముతోనే మీరు గెలిచారు. నా వద్ద 60 కోట్లు ఉంటే సంగారెడ్డిలో మీకు చుక్కలు చూయించేటోన్ని. ప్రశాంత్ రెడ్డి కొంత నోరు అదుపులో పెట్టుకోవాలి. హరీశ్‌రావు నల్లడబ్బు ఎక్కడ దాచారో బయటకు తీయమని మా సీఎం రేవంత్ రెడ్డితో చెప్పాను.

మీ దగ్గరున్న ఎమ్మెల్యేల్లో 20 మంది మా దగ్గరకు వస్తారు. నేరుగా ఆయా శాఖల మంత్రుల దగ్గరకు వెళ్తారు. మీ పదేళ్ల పాలనలో మీ పార్టీలో ఎవరైనా కేసీఆర్ దగ్గరకు నేరుగా వెళ్ళారా? వెళ్ళే అవకాశం ఇచ్చారా? మల్లారెడ్డి కూడా మా పార్టీలోకి రావొచ్చు. మీ పార్టీ నుంచి 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారు. మీ పార్టీలో స్వేచ్ఛ లేదు. ఎమ్మెల్యేలందరూ ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వాన్ని పడగోడతాం అంటున్నారు. పడగొట్టాడానికి ఇదేమైనా మేడిగడ్డ పిల్లరా? 135 యేండ్ల ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ చరిత్రను కూల్చడం ఎవరితరం కాదు.

జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక వెపన్, ఒక బ్రాండ్. అనేక ఒడిదుడుకులతో పైకి వచ్చినోన్ని. పదవుల కోసం బానిస చేసే టోన్ని కాదని ప్రశాంత్ రెడ్డి తెలుసుకోవాలి. ప్రొటోకాల్ అమలులో బీఅర్ఎస్ పార్టీ నేర్పించిన విద్యనే.. తిరిగి మీకే అందిస్తున్నాం.. ప్రశాంత్ రెడ్డి గమనించాలి. మమ్మల్ని మేము కాపాడుకుంటూ, మీకు ఎలా గుణపాఠం చెప్పాలో మాకు బాగా తెలుసు. కేసీఆర్‌కు హరీశ్‌రావు ఎప్పుడైనా వెన్నుపోటు పొడుస్తారు. హరీశ్‌రావు వెన్నుపోటు అల్లుడు. మెదక్ పార్లమెంట్ స్థానానికి నేను దరఖాస్తు పెట్టుకోలేదు. అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే పోటీకి సిద్దంగా ఉంటా. అంతేకాని నాకు నేనుగా పోటీకి ముందుకు రాన”ని జగ్గారెడ్డి అన్నారు.

Also Read: ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్..! ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలు ఇవే..!