Hyderabad: సంతానం లేని వారికి ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్న పూజారి.. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఇవాళ ఉదయం 5 గంటల నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయానికి భక్తులు బారులు తీరారు.

రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ కి భక్తులు పోటెత్తారు. సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు పూజారి. హైదరాబాద్ తో పాటు చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి కార్లలో భక్తులు భారీగా చేరుకుంటున్నారు.

దీంతో ఓఆర్ఆర్ పోలీస్ అకాడమీ మెయినాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ వద్ద వాహనాలు నత్తకడకతో ముందుకు కదలుతున్నాయి.

పోలీసులు సైతం ట్రాఫిక్ ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయానికి భక్తులు బారులు తీరారు. ట్రాఫిక్ లో స్కూల్ బస్సులు కూడా ఇరుక్కుపోతున్నాయి. విద్యార్థులు, ఆఫీసుకు వెళ్లే ఉద్యోగస్థులు. తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సరైన సమయానికి ఆఫీసుకి వెళ్లలేకపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో తీవ్ర విషాదం.. మైనర్ బాలుడి డ్రైవింగ్ వల్ల..

ట్రెండింగ్ వార్తలు