Traffic restrictions
Traffic Restrictions : హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ నేటి నుంచి 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ నెల 11 న ఎలక్ట్రిక్ కార్ రేస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు ఎన్టీఆర్ మార్గ్ లో జరుగగనున్నాయి. దీంతో ఈ రోజు నుంచి 12 వరకు ఎన్టీఆర్ మార్గ్ మూసివేశారు.
ఈ మార్గంలో వెళ్లాలనుకునే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. అలాగే బస్ రూట్స్ లో కూడా డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు. ప్రజలు మెట్రో రైలు ప్రయాణం వినియోగించాలని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను విరివిగా వాడుకోవాలన్నారు.
Hyderabad T20 Match: 4 వేల కార్లు, 5 వేల బైకుల పార్కింగుకు స్థలం కేటాయింపు.. ట్రాఫిక్ ఆంక్షలు
లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ జంక్షన్, ఇగ్బాల్ మినార్ గుండా వెళ్లే వాహనదారులు వేరే మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అయితే. నూతన సచివాలయ పనులకు ఆటంకం లేదని, పనులు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.