Traffic Restrictions : హైద‌రాబాద్‌లో ఇవాళ్టి నుంచి 17వ తేదీ అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ప్రాంతాల్లో అంటే..

ఇవాళ్టి నుంచి ఈనెల 17వ తేదీ అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ముఖ్యంగా నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, మింట్ కాంపౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Traffic restrictions in Hyderabad

Traffic Restrictions In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. భాగ్యనగరంలోనూ వినాయక చవితి ఉత్సవాల కోలాహలం నెలకొంది. వాడవాడన బొజ్జ గణపయ్యలు కొలువుదీరారు. పూజా కార్యక్రమాలతో.. జై బోలో గణేశ్ మహరాజ్ కు జై అంటూ భక్తిపారవశ్యంలో నగర వాసులు మునిగిపోయారు. ఖైరతాబాద్ గణేషుడికి తొలిపూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి రూపంలో మహాగణపతి దర్శనమివ్వనున్నారు.

Also Read : Ganesh Chaturthi 2024 : వినాయకుడి ముందే భక్తులు గుంజీలు ఎందుకు తీస్తారో తెలుసా? దీనికి పురాణాల్లో ఓ కథ ఉంది.

ఖైరతాబాద్ బడా గణేశ్ తోపాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసినందున ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర పోలీసులు వెల్లడించారు. శనివారం నుంచి ఈనెల 17వ తేదీ నిమజ్జనం అర్థరాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ముఖ్యంగా నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, మింట్ కాంపౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

 

  • ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
    ఖైరతాబాద్ వినాయక విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ కు అనుమతిలేదు.
    పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఖైరతాబాద్ గణేశ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ రాజ్ దూత్ లైన్ లోకి అనుమతించరు.
    ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమతించరు.
    ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ వాహనాలకు ప్రవేశం లేదు.
    నెక్లెస్ రోటరీ వద్ద తెలుగు తల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు నిరంకారి నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ కు అనుమతిలేదు.
    ఖైరతాబాద్ పోస్టాఫీస్ లేను ఖైరతాబాద్ రైల్వే గేటు వైపు అనుమతించరు.
    నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి వచ్చే సందర్శకులు వాహనాలకోసం ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పారింగ్ స్థలం, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలాలు, ఐమాక్స్ ఎదురుగా, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ సదుపాయం కల్పించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు