Hyderabad Traffic Police: వాహనదారులు అలర్ట్.. రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల వరకు అంటే..

రేపు బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు. ఆదివారం ఉదయం 8గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

Hyderabad Traffic Police: రేపు బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు. రేపు బక్రీద్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ప్రార్థనల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆదివారం ఉదయం 8గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టనున్నారు.

Traffic Rules : ట్రాఫిక్ రూల్స్‘బ్రేక్’ చేయటానికి కారణాలు ఇవట..! తెలిసింది కదా..పోలీసు బాబూలు ఇక చూస్కోండీ..

– బక్రీద్ నమాజ్ దృష్ట్యా మాసాబ్ ట్యాంక్, హకీ గ్రౌండ్ వద్ద ట్రాఫిక్ మళ్లించబడుతుందని, ట్రాఫిక్ నిర్వహణ కోసం మాసాబ్ ట్యాంక్ పరిసరాల్లో రోడ్లు మూసివేయబడతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మెహిదీపట్నం నుంచి మాసాబ్ ట్యాంక్ మీదుగా రోడ్ నెం.1, బంజారాహిల్స్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ ప్లై‌ఓవర్ మాసాబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్ (ఎడమ మలుపు) ఖైరతాబాద్, ఆర్టీఏ కార్యాలయం, ఖైరతాబాద్ (ఎడమ మలుపు) తాజ్ కృష్ణ హోటల్ మీదుగా మళ్లించడం జరుగుతుందని తెలిపారు. ప్రార్థనలు పూర్తయ్యే వరకు మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ దిగువ నుంచి రోడ్ నెం.1, బంజారాహిల్స్ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు.
– NFCL/ బంజారాహిల్స్ నుండి వచ్చే వాహనాలను మాసాబ్ ట్యాంక్ వైపు అనుమతించమని పోలీస్ తెలిపారు. అదేవిధంగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం, నిరంకారి, లక్డీకపూల్, మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్, మెహదీపట్నం వైపు మళ్లిస్తారు.

Telangana Rains : కుండపోత వర్షాలతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం

నమాజ్ జరిగే ప్రాంతాల్లో పార్కింగ్..
– బక్రీద్ నమాజ్ దృష్ట్యా మీరాలం ట్యాంక్ ఈద్గా వద్ద ట్రాఫిక్ మళ్లించబడుతుందని, ట్రాఫిక్ నిర్వహణ కోసం మీరాలం ట్యాంక్ పరిసరాల్లో రోడ్లు మూసివేయడం జరుగుతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
– కిషన్ బాగ్ వైపు నుండి నమాజీలు బహదూర్ పురా ఎక్స్‌రోడ్స్ గుండా అనుమతించబడతారు. సాధారణ వాహనాల రాకపోకలు బహదూర్‌పురా ఎక్స్‌రోడ్స్ వద్ద కిషన్ బాగ్ వైపు మళ్లించబడతాయి. (ఈ ప్రాంతంలో నమాజ్ కోసం వచ్చిన వారు జూపార్క్, మస్జీద్ అల్లాహోఅక్బర్ ఓపెన్ స్పేస్ ఎదురుగా వాహనాలు నిలుపుకోవచ్చు)
– శివరాంపల్లి వైపు నుంచి వచ్చే నమాజీలను దానమ్మ హట్స్ ఎక్స్‌రోడ్లు మీదుగా అనుమతిస్తారు. సాధారణ వాహనాల రాకపోకలను దానమ్మ హట్స్ ఎక్స్‌రోడ్ల వద్ద శాస్త్రిపురం, ఎస్ఎస్ కుంట వైపు మళ్లిస్తారు.( పార్కింగ్ కోసం.. ఆదునిక సా మిల్, మీర్ ఆలం ఫిల్టర్ బెడ్, మీర్ ఆలం ఫిల్టర్ బెడ్ పక్కన ఖాళీ స్థలం)
– కాలాపత్తర్ వైపు నుండి నమాజీలు కాలాపత్తర్ L&O PS మీదుగా అనుమతించబడతారు. కాలాపత్తర్ L&O PS వద్ద సాధారణ వాహనాల రాకపోకలు మోచి కాలనీ, బహదూర్ పురా, షంషీర్గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు మళ్లించబడతాయి. (పార్కింగ్ కోసం.. భయ్యా పార్కింగ్, ఇండియస్ ఆయిల్ పెట్రోల్ బంక్, BNK కాలనీ పక్కన విశాఖ సిమెంట్స్)
– పురానాపూల్ నుండి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాల రాకపోకలు పురానాపూల్ దర్వాజా వద్ద జియాగూడ, సిటీ కాలేజీ వైపు ప్రార్థనలు ముగించుకుని అందరూ ఈద్గా వదిలివెళ్లే వరకు మళ్లించబడతాయి.
– శంషాబాద్, రాజేంద్ర నగర్, మైలార్దేవ్‌పల్లి నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను ఆరామ్ఘర్ జంక్షన్ వద్ద రాజేంద్ర నగర్/అత్తాపూర్ లేదా మైలార్ దేవ్‌పల్లి వైపు మళ్లిస్తారు.

పైన పేర్కొన్న ట్రాఫిక్ సలహాలను గమనించి, పైన పేర్కొన్న రూట్లు, సమయాల్లో తదనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని వాహనదారులు, నగర ప్రజలను పోలీసులు కోరారు. ప్రజలు ఏదైనా ప్రయాణ సమాచారం, సహాయం కోసం దయచేసి 040-278524821 9010203626 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు