Heart Attack: బ్యాంకులో గుండెపోటుతో వృద్ధుడు మృతి.. హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం
బ్యాంకు సిబ్బంది వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వృద్ధుడు చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
- Naveen
- Published on- April 15, 2026 / 06:26 PM IST
Heart Attack: హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది. బ్యాంకులో ఓ వృద్ధుడు గుండెపోటుతో చనిపోయారు. హబ్సిగూడలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ ఘటన జరిగింది. మృతుడిని లక్ష్మీనారాయణగా గుర్తించారు. డబ్బు డిపాజిట్ చేసేందుకు ఆయన బ్యాంకుకి వెళ్లారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి వెళ్లిన లక్ష్మీనారాయణ డిపాజిట్ స్లిప్ ఫిలప్ చేస్తున్నారు. అదే సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. బ్యాంకు సిబ్బంది వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వృద్ధుడు చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. వృద్ధుడిని నాచారానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగిగా గుర్తించారు పోలీసులు. స్లిప్ ఫిలప్ చేస్తూ ఒక్కసారిగా ఆయన కుప్పకూలడం బ్యాంకులోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది, కస్టమర్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. మరణం ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.
Also Read: ఆడుకునేందుకు కారెక్కిన ఐదేళ్ల చిన్నారి.. ఊహించని ఘటనతో.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి..
Tragedy in #Habsiguda
A #retiredemployee died of a suspected #heartattack while visiting a #bank to deposit #money in Habsiguda.
Laxmi Narayana, a resident of #Nacharam, collapsed suddenly while filling out a deposit form at #PunjabNationalBank.
Despite being… pic.twitter.com/qI7Ob8hN9m
— NewsMeter (@NewsMeter_In) April 15, 2026
