suryapet kabaddi : సూర్యాపేటలో గ్యాలరీ కూలిపోవడానికి కారణం ?

Junior National Kabaddi : 47వ జాతీయ స్థాయి సబ్ జూ.కబడ్డీ పోటీల్లో తీవ్ర కలకలం రేగింది. పోటీలు వీక్షించేందుకు భారీగా జనాలు తరలివచ్చారు. దీంతో వారు కూర్చొన్న గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం ఛేంజ్ అయిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. హాహాకారాలతో ఆ ప్రాంతం మిన్నంటాయి. ఏదో ప్రమాదం జరిగిందంటూ జనాలు పరుగులు తీశారు. ఒకరిపై నొకరు తోసుకుంటూ..తొక్కుకుంటూ పరుగులు తీశారు. శిథిలాల కింద ఎంతో మంది చిక్కుకున్నారు. వెంటనే అక్కడున్న వారు..కిందపడిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు.

పోలీసు వాహనాలు, ఇతర వెహికల్స్ లో సమీప ఆసుపత్రులకు తరలించారు. దాదాపు 200 మందికి గాయాలైనట్లు సమాచారం. అందులో 100 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. కొంతమంది తలలు పగిలిపోగా..మరికొంతమంది చేతులు, కాళ్లు విరిగిపోయినట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆవరణలో ఉన్న పోలీసు పరేడ్ గ్రౌండ్ లో 47వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు చేశారు. 60 జట్లు పాల్గొనేలా..ఆరు కబడ్డీ కోర్టులను తయారు చేశారు. నాలుగు వైపులా..ప్రేక్షకులు కూర్చొని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఈ గ్రౌండ్ లో 20 వేల మంది కూర్చొవచ్చు. ఒక్కో గ్యాలరీలో సుమారు ఐదు వేల మంది కూర్చొని పోటీలు చూడవచ్చు. ఏర్పాటు చేశారు.

కానీ ప్రమాదం జరిగిన గ్యాలరీలో సుమారు ఏడు వేల మంది కూర్చొన్నట్లు తెలుస్తోంది. దీంతో కెపాసిటీ దాటి పోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పోటీలు ప్రారంభిస్తున్నట్లు, మంత్రి జగదీశ్వర్ వస్తున్నారని నిర్వాహకులు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం నాలుగు రోజుల పాటు కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. కానీ ప్రారంభం కాకముందే..ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. అయితే..ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు