HYD: హైదరాబాద్‌లో దారుణం.. తన బిడ్డ ఏమైపోతుందోననే బెంగతో విషమిచ్చిన తల్లి.. ఆ తరువాత ఆమె ఏం చేసిందంటే..

హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల తన కూతురికి తల్లి కూల్ డ్రింక్ లో ఎలుకల ముందు కలిపి తాగించింది.. ఆ తరువాత ఆమె..

Mother poisons her five year old daughter

Mother Daughter Tragedy in Hyderabad: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను కత్తితో నరికి చంపిన ఘటన మరవక ముందే.. మరో తల్లి ఐదేళ్ల కూతురికి తన చేతులతో విషమిచ్చి చంపేసింది. ఈ ఘటన బాచుపల్లిలోని ప్రగతి నగర్ లో చోటు చేసుకుంది. అయితే, కూతురికి విషమిచ్చిన తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

 

గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన నంబూరి కృష్ణపావని (33), సాంబశివరావు దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వలసవచ్చారు. బాచుపల్లిలో ప్రగతినగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు జశ్విక(5) ఉంది. సాంబశివరావు సాఫ్ట్ వేర్ ఇంజినీర్. కృష్ణ పావని ఇంట్లోనే ఉంటుంది. అయితే, ఆమె గత కొద్దికాలంగా నరాల వ్యాధితో బాధపడుతోంది. ఆందోళన ఎక్కువై తరచూ అనారోగ్యంకు గురవుతుంది. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను ఆత్మహత్య చేసుకుంటే తన బిడ్డ అనాథగా మారుతుందని భావించిన కృష్ణ పావని.. ఐదేళ్ల కూతుర్నితోసహా చనిపోవాలని నిర్ణయించుకుంది.

 

ఈనెల 18వ తేదీన భర్త సాంబశివరావు ఆఫీస్ కు వెళ్లాడు. ఆరోజు సాయంత్రం సమయంలో కూల్ డ్రింక్ తెచ్చుకొని అందులో ఎలుకల మందు కలిపింది. ఆ కూల్ డ్రింగ్ ను తన ఐదేళ్ల కూతురు జశ్వికకు తాగించిన కృష్ణ పావని.. మిగిలిన కూల్ డ్రింక్ ను తాను తాగింది. రాత్రి తన భర్త ఇంటికి వచ్చేసరికి కూతురు అనారోగ్యంగా ఉండటాన్ని చూసి కృష్ణ పావనని ప్రశ్నించాడు. ఫుడ్ ఫాయిజిన్ అయిందని, అందుకే అనారోగ్యంగా ఉందని చెప్పింది. అయితే, మరుసటిరోజు భర్త సాంబశివరావుకు అనుమానం వచ్చి కృష్ణ పావనని గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయం చెప్పింది.

 

తన అనారోగ్య కారణాల వల్ల చనిపోవాలని నిర్ణయించుకున్నాను.. నేను చనిపోతే తన ఐదేళ్ల కూతురు అనాథ అవుతుందని భావించి తనను కూడా నాతో తీసుకెళ్లాలని అనుకున్నా. అందుకే కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి తనకు తాగించి.. నేను తాగాను అని చెప్పింది. దీంతో భర్త హుటాహుటీన వారిద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కూతురు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రెయిన్ బో చిల్డ్రన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఐదేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. కృష్ణ పావని ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతుంది. ఈ దారుణ ఘటనపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదేళ్ల చిన్నారి జశ్విక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.