Tribal woman Raped
Tribal woman Raped : దంపతులిద్దరూ అడ్డా కూలీలు. భర్త రెండ్రోజుల క్రితం పని ఉందని గజ్వేల్ వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే గిరిజన మహిళ పనికోసం టిఫిన్ బాక్స్ పట్టుకొని వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాలేదు.. అమ్మ ఇంటికి రాలేదంటూ కొడుకు తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు.
ఆందోళనతో ఇంటికి వచ్చిన భర్త.. స్థానికులతో కలిసి తెలిసిన ప్రదేశాలన్నీ వెతికాడు. అయినా ఆమె ఆచూకీ లభించలేదు. కానీ శనివారం ఉదయం 10గంటలకు ఆమె ఆచూకీ తెలిసింది. కానీ, అప్పటికే గిరిజన మహిళ ప్రాణాలు విడిచింది.
మెదక్ జిల్లా ఏడుపాలయల పుణ్యక్షేత్ర సమీపంలో ఘోరం జరిగింది. ఆలయానికి అతి సమీపంలోని ఓ వెంచర్ పక్కన ముళ్ల పొదల్లోకి గిరిజన మహిళను తీసుకెళ్లి గుర్తు తెలియని దుండగులు అత్యాచారంకు పాల్పడ్డారు. ఆపై తీవ్రంగా కొట్టారు. వివస్త్రను చేసి స్తంభానికి చేతులు కట్టేశారు. దీంతో ఆమె మృతిచెందింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులో శనివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మహిళను వెంచర్లోని స్తంభానికి చేతులు కట్టేసి ఉంచగా.. తలకు బలమైన గాయం, కుడిచేయి విరిగి ఉంది. మెడ, ఇతర చోట్ల గాయాలయ్యాయి. స్పృహ తప్పిపోయి ఉంది. వెంటనే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
రాత్రి వరకు స్పృహలోకి రాకపోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించే క్రమంలో గిరిజన మహిళ మృతి చెందింది. గిరిజన మహిళపై అత్యాచారం చేసిన తరువాతే దాడిచేసి ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అయితే, ల్యాబ్ కు శాంపిల్స్ పంపించామని రిపోర్టు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.