TRS Plenary : హెచ్ఐసీసీ వేదికగా టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ కొనసాగుతోంది. పార్టీ జెండా ఆవిష్కరించి ప్లీనరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్లీనరీ వేదికపై అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్లీనరీకి 3వేల మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు.

TRS Plenary : హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ కొనసాగుతోంది. పార్టీ జెండా ఆవిష్కరించి ప్లీనరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్లీనరీ వేదికపై అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్లీనరీకి 3వేల మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు.  ఈ రోజు (ఏప్రిల్ 27) బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రతినిధుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు.

నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరమంతా గులాబీమయమైంది. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా పండుగను రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండాలు ఎగురవేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు వివిధ అంశాలపై రాజకీయ తీర్మానాలు, మధ్యాహ్నం ఒంటిగంటకు లంచ్ ఉంటుంది. లంచ్‌లో 27 రకాల వంటకాలు సిద్ధం చేయనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు తీర్మానాల ఆమోద ప్రక్రియ జరుగనుంది.

ట్రెండింగ్ వార్తలు