Aasara Pensions: సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. వచ్చేనెల వారికి కూడా పింఛన్..

తెలంగాణ రాష్ట్రంలో 2018ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానం మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ వచ్చేనెల నుంచి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈమేరకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసినట్లు వెల్లడించారు.

Kcr

Aasara Pensions: తెలంగాణ రాష్ట్రంలో 2018ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానం మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ వచ్చేనెల నుంచి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈమేరకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అమలులో వున్న నిబంధనల ప్రకారం 65 ఏళ్లు నిండిన వారికే ఆసరా పింఛన్లు ఇస్తుండగా.. వచ్చే నెల(ఆగస్ట్) నుంచి 57 ఏళ్లు నిండినవారికి కూడా వృద్ధాప్య పింఛన్లు అందజేయనున్నట్లు ప్రకటించారు కేసీఆర్. సీఎం కేసీఆర్ సూచనలు మేరకు అధికారయంత్రాగం ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సమాచారం. అయితే, ఆసరా పింఛన్ల నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి.

నిబంధనలు:
> 57 ఏళ్లు నిండినవారు ఆసరాకు అర్హులు(1953–1961 మధ్య జన్మించిన వారై ఉండాలి).
> ఓటర్‌ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారణ.
> తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు

>విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు ఆసరాకు అనర్హులు.
> దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండరాదు.
> దరఖాస్తుదారుడి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు పరిమితి దాటరాదు.

> దరఖాస్తుదారులకు ఎక్కువ ఇన్‌కమ్ వచ్చే వ్యాపారాలు ఉండరాదు.
> పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేవారు.. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు, వ్యాపారాల్లో కొనసాగుతున్న వారి సంతానంపై ఆధారపడి ఉన్నవారై ఉండరాదు.
> హెవీ వెహికిల్స్ ఉన్నవారు ఆసరాకు అనర్హులు, ఐటీ రిటర్నులు దాఖలు చేసినామ అనర్హులే.
> లబ్ధిదారుల సంతానం ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులై ఉండరాదు.