Bhagat Ane Nenu: భగత్ అనే నేను.. ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పై గెలిచిన నోముల భగత్.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.

TRS MLA Nomula Bhagath: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పై గెలిచిన నోముల భగత్.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో భగత్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భగత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డు నోముల భగత్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, భాస్కర్ రావు,ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు తదితరులు పాల్గొన్నారు.

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హఠాన్మరణంతో వచ్చిన ఎన్నికల్లో భగత్ కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డిపై గెలిచారు. ఏప్రిల్‌ 17న ఉపఎన్నిక జరగగా.. తర్వాత వచ్చిన ఫలితాల్లో భగత్‌కు భారీ మెజారిటీ లభించింది.

ట్రెండింగ్ వార్తలు