TRS office in Delhi: కేసీఆర్‍‌కు నామా డిన్నర్.. సతీసమేతంగా ఢిల్లీకి సీఎం

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) దక్షిణ భారత తొలి ప్రాంతీయ రాజకీయ పార్టీగా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దేశ రాజధాని హస్తినలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణం గురువారం..

Trs In Delhi

TRS office in Delhi: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) దక్షిణ భారత తొలి ప్రాంతీయ రాజకీయ పార్టీగా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దేశ రాజధాని హస్తినలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణం గురువారం ప్రారంభం కానుంది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఈ ఆఫీస్ కోసం ఢిల్లీ వసంత్‌ విహార్‌లో కేంద్ర ప్రభుత్వం లీజు ప్రాతిపదికన వెయ్యి 100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది.

మధ్యాహ్నం 1:48 గంటలకు జరిగే భూమిపూజ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ దంపతులు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొంటారు. ఇందులో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో బుధవారం సాయంత్రం 5గంటల 45నిమిషాలకు సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా ఢిల్లీ చేరుకున్నారు. సీఎం వెంట ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్, ఎంపీ సంతోష్‌ కుమార్‌ కూడా ఉన్నారు. వారి కంటే ముందే మల్లారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఢిల్లీ చేరుకున్నారు.

సీఎం కేసీఆర్‌ నిబద్ధత కారణంగానే ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ఆఫీస్ ఏర్పాటుకానుందని, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణంలో తనకు భాగస్వామ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యాలయ నిర్మాణ నమూనాలకు ఆమోదముద్ర ఇంకా రాలేదని అన్నారు. కొత్త భవనంలో అధ్యక్షుల చాంబర్‌తోపాటు కాన్ఫరెన్స్‌ హాలు, లైబ్రరీ, ఆడియో విజువల్‌ గది ఉండనున్నాయి. ఏడాదిలోగా భవన నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు.

సీఎం కేసీఆర్‌కు నామా డిన్నర్
ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్, మినిష్టర్లు ఇతర నాయకులకు పార్టీ ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు డిన్నర్ ట్రీట్ ఇచ్చారు. కార్యాలయ శంకుస్థాపన ఏర్పాట్ల గురించి మంత్రి కేటీఆర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.