దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి తట్టుకోలేక పార్టీ నేత మృతి

  • Published By: bheemraj ,Published On : November 11, 2020 / 04:00 PM IST
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి తట్టుకోలేక పార్టీ నేత మృతి

Updated On : November 11, 2020 / 4:20 PM IST

TRS leader died : దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని తట్టుకోలేక ఆ పార్టీ నేత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్లశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కాల్వశ్రీరాంపూర్ సింగిల్ విండో డైరెక్టర్ పులి సత్యనారాయణరెడ్డి, పార్టీ నాయకులతో కలిసి ఉత్కంఠగా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలను టీవీలో వీక్షిస్తున్నారు.



సాయంత్రం టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత ఓడిపోయారని ప్రకటించడంతో తీవ్ర కలత చెందారు. బీజేపీ వారు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారంటూ సహచరులకు చెబుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చికిత్స కోసం వెంటనే అతన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు.



సత్యనారాయణరెడ్డి మరణంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అతని హఠాన్మరణంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.