TRS Politics : కొల్లాపూర్ పాలిటిక్స్..జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లారు మంత్రి కేటీఆర్.

TRS Politics  In Kollapur : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లారు మంత్రి కేటీఆర్. కొంతకాలంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూపల్లికి స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి మధ్య విబేధాలున్నాయి. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్యా ఉన్న ఆధిపత్యపోరాు మరింతగా ముదిరింది. గతంలో మంత్రి కేటీఆర్ సభకే కాకుండా ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరికి కూడా జూపల్లి హాజరుకాలేదు. దీంతో నాగర్ కర్నూల్ పర్యటనలో ఉన్న కేటీఆర్ జూపల్లిఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. పలు అంశాల గురించి చర్చించారు.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూపల్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి కారు ఎక్కడంతో కొల్లాపూర్ టిఆర్ఎస్ లో అగ్గి రాజుకుంది. మాజీ నేతల మధ్య ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఐక్యత కుదరడం లేదు.ప్రతీ విషయంలోనే ఆధిపత్యం ధోరణే కొనసాగుతోంది.

దీనికి తోడు నియోజకవర్గంలో నాయకులు..కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటంతో పార్టీలో ఐక్యత దెబ్బతిందనే విషయం స్పష్టమవుతోంది. ఈక్రమంలో ఈ విషయం ఇంతకంటే పెద్దది అయితే పార్టీకే నష్టం జరుగుతుందనే ఆలోచించిన కేటీఆర్ ఎలాగూ నాగర్ కర్నూల్ పర్యటనలో ఉన్నారు కాబట్టి జూపల్లి ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. దీంతో కొల్లాపూర్ లో నెలకొన్న వర్గపోరు నేపథ్యంలో జూపల్లిని కేటీఆర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితి, నెలకొన్న గ్రూపు రాజకీయాలపై జూపల్లి తో మంత్రి కేటీఆర్ చర్చించినట్లుగా సమాచారం.

ట్రెండింగ్ వార్తలు