TRS Protest : మోదీని ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయి – టీఆర్ఎస్

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరిసస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు నిరసనలు చేపట్టాలని గులాబీ బాస్ ఇచ్చిన పిలుపు మేరకు

Trs

TRS Protest At Begumpet : ప్రధాన మంత్రి మోదీని ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయి.. ఆయనకు పోయేకాలం దగ్గరపడింది…బీజేపీకి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు గళమెత్తారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరిసస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు నిరసనలు చేపట్టాలని గులాబీ బాస్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ కదిలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టింది. గ్యాస్, పెట్రోల్ డబ్బాలతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మోదీ డౌన్.. డౌన్ అనే ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.

Read More : KTR US Tour: తెలంగాణ అభివృద్ధిని అమెరికాలో చాటిన కేటీఆర్

ఈ క్రమంలో… 2022, మార్చి 24వ తేదీ గురువారం ఉదయం బేగంపేట చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ కార్యాలయం ముందు మంత్రి తలసాని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనలో హోం మంత్రి మహమూద్ ఆలీ, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా… వారు మాట్లాడుతూ.. కేంద్రం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు భారీగా పెంచింది.. దీని ప్రభావం నిత్యావసరాల పైన పడుతుందని ఈ పరిస్థితిలో సామాన్యుడి బతకలేడన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే పెంచారని  విమర్శించారు. దేశలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

Read More : Telangana Crops: ఢిల్లీ వైపు, తెలంగాణ రైతాంగం చూపు

దీంతో నరేంద్ర మోదీని ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది టీఆర్ఎస్.. తెలంగాణ ప్రభుత్వం చేసింది 150 పథకాలు ఉన్నాయి.. కేంద్రం ఒక్కటి కూడా తెలేదు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మటం తప్ప వేరే లేదు.. మోడీ కి పోయేకాలం దగ్గర పడింది.. దేశంలో వరి ధాన్యం కొనుగోలు చేయమంటే చేయలేదన్నారు. మీకు పని లేదా అంటూ కేంద్ర మంత్రులు మన మంత్రులను ఉద్ధేశించి అంటున్నారని, మతాలను అడ్డం పెట్టుకొని, రాజకీయాలు చేస్తోంది బీజేపీ పార్టీయేనని ఆరోపించారు. బీజేపీని కూకటి వేళ్ళతో పెకింలించి వేయాలని పిలుపునిచ్చారు. పేద వర్గాలను దృష్టిలో ఉంచుకొని అనేక పథకాలు తెలంగాణ అమలు చేస్తోందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రశ్నిస్తే ఈడీలు, సీబీఐ దాడులు చేయిస్తోందని, రాబోయే రోజుల్లో బీజేపీ పైన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.