Jangaon : అందరి చూపు జనగామ వైపు.. కేసీఆర్ స్పీచ్‌‌పై ఉత్కంఠ

ముందుగా కలెక్టరేట్‌ భవనం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.20గంటల నుంచి 1.20గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం భారీ బహిరంగ సభ జరగనుంది.

Kcr

TRS Public Meeting In Jangaon : అందరి చూపు జనగామ వైపు నెలకొంది. అక్కడ టీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. దీంతో ఆయన ఏమి మాట్లాడుతారన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. జిల్లాల పర్యటనలో భాగంగా 2022, ఫిబ్రవరి 11వ తేదీ శుక్రవారం జనగామకు రానున్నారు గులాబీ బాస్. ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా టీఆర్ఎస్ నేతలంతా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read More : Sensex Crashes : నష్టాల్లో స్టాక్ మార్కెట్

అంతేగాదు.. గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. మోదీ వ్యాఖ్యలను వారు తప్పుబడుతూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కానీ.. ఈ విషయంలో మాత్రం సీఎం కేసీఆర్ రియాక్ట్ కాలేదు. ఏ విషయంలో అయినా.. మిగతా వారికి కాస్త భిన్నంగా, ఘాటుగా స్పందించే కేసీఆర్.. తెలంగాణ ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలకు ఏ రకంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ విషయానికి వస్తే… ఉదయం 11గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి.. 11.30గంటలకు జనగామకు చేరుకుంటారు.

Read MorePooja Hegde : 13 ఏళ్ళ తర్వాత కుటుంబంతో కలిసి విహారయాత్రకు పూజా హెగ్డే.. మాల్దీవ్స్ లో రచ్చ..

ముందుగా కలెక్టరేట్‌ భవనం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.20గంటల నుంచి 1.20గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు లక్ష మందికిపైగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వస్తారని తెలుస్తోంది. ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ, బీజేపీని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన కామెంట్స్ తరువాత సీఎం కేసీఆర్ తొలిసారి బహిరంగ సభలో మాట్లాడనుండడంతో… ఆయన ఈ సభ ద్వారానే మోదీ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇస్తారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.