Trs Tributes To Ntr For Ntr Satha Jayanthi Celebrations In Ntr Ghat Hyderabad
TRS : టీడీపీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాలు సందర్భంగా టీఆర్ఎస్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. అధికార టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో గులాబీ నేతలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి కావడంతోనే ఆయనకు నివాళులర్పించినట్టు గులాబీ పార్టీ చెబుతోంది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కొందరు టీఆర్ఎస్ ప్రతినిధులు ఎన్టీఆర్ గార్డెన్స్‌కు వెళ్లి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.
టీఆర్ఎస్ ముందు నుంచే ఎన్టీఆర్‌పై సానుకూల వైఖరితో ఉంది. ఎన్టీఆర్‌కు సంబంధించి పలు అంశాలపై కూడా టీఆర్ఎస్ గతంలోనూ పలుమార్లు సానుకూలంగా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. అదే వైఖరితోనే టీఆర్ఎస్ ఇప్పుడు తారకమంత్రాన్ని జపిస్తోందా? అందులో భాగంగానే ఎన్టీఆర్‌కు నివాళులర్పించిందా? లేదా రాజకీయంగా టీఆర్ఎస్ వ్యూహాం మరేదైనా ఉందా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఓ సామాజిక వర్గానికి చేరువయ్యేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీలో నుంచి పార్టీలో చేరిన నేతలకే టీఆర్ఎస్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా టీఆర్ఎస్ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నగరంలోని ఫిల్మ్ నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ వేడుకకు టీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా హాజరుకానున్నట్టు తెలిసింది.
Read Also : NTR : ఫిల్మ్‌నగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తరలి రానున్న ఎన్టీఆర్ కుటుంబం..