ఆల్ ది బెస్ట్ : TS EAMCET 2020

  • Publish Date - September 9, 2020 / 05:51 AM IST

TS EAMCET 2020 : కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఎగ్జామ్స్ ఒక్కొటిగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో EAMCET 2020 పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. 2020, సెప్టెంబర్ 09, 10, 11, 14 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 102 (తెలంగాణాలో 79, ఏపీలో 23) పరీక్ష కేంద్రాలు కేటాయించారు.




మొత్తం లక్షా 43 వేల 165 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్ లో ( ఉదయం 09 గంటలకు, మధ్యాహ్నం 03 గంటలకు) పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రంలోకి గంటన్నర ముందు నుంచే అనుమతినిస్తామని, సమయం కంటే నిమిషం ఆలస్య మైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
https://10tv.in/cm-jagan-review-on-corona-in-spandana/
ఇక కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు పకడ్బంది చర్యలు చేపట్టారు. విద్యార్థులకు పలు సూచనలు జారీ చేసింది. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని సూచించింది. కరోనా లేదని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. పరీక్షా కేంద్రంలో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా నిర్వహిస్తారు. హై ఫీవర్, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలున్న వారిని కేంద్రంలోకి అనుమతించరు.



కరోనా వైరస్ సోకిన వారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారు. ఆన్ లైన్ లో సబ్మింట్ చేసిన దరఖాస్తు ఫారంపై గెజిటెడ్ అధికారి/ప్రిన్స్ పాల్ సంతకం అవసరం లేదు. దరఖాస్తు ఫారం, హాల్ టికెట్, ఆధార్ వంటి తదితర ఒరిజినల్ ఐడీ కార్డు చూపించాల్సి ఉంటుంది. మాస్క్, శానిటైజర్, వాటర్ బాటిల్ లను పరీక్ష కేంద్రంలోకి అనుమతినిస్తారు.