TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!

కరోనా పరిస్థితుల్లో తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలను ఎట్టకేలకు విజయవంతంగా నిర్వహించి, ఫలితాలను ప్రకటించింది ప్రభుత్వం.

Councelling

TS EAMCET 2021: కరోనా పరిస్థితుల్లో తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలను ఎట్టకేలకు విజయవంతంగా నిర్వహించి, ఫలితాలను ప్రకటించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇవాళ(30 ఆగస్ట్ 2021) నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎంసెట్‌ కౌన్సెలింగ్ ప్రారంభం అవుతోంది. సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్‌లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది విద్యాశాఖ. స్లాట్ బుకింగ్ చేసుకున్న విద్యార్థులకు సెప్టెంబర్ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి.

అవసరమైన సర్టిఫికేట్స్:
ఇంటర్‌ సెకండ్ ఇయర్‌ హాల్‌ టికెట్‌
పర్సనల్‌ ఈ-మెయిల్‌ ఐడీ
పర్సనల్‌ మొబైల్‌ నెంబర్‌
పదో తరగతి హాల్‌ టికెట్‌ నెంబర్‌
క్యాస్ట్ సర్టిఫికేట్‌
లోకల్‌ సర్టిఫికేట్‌

సెప్టెంబర్ 15వ తేదీన మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనుండగా.. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 15 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి.