TS ECET : జులై 29 నుంచి టీఎస్ఈసెట్ కౌన్సెలింగ్

ఆగస్టు 20వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 175 కాలేజీల్లో ఉన్న 11 వేలకు పైగా సీట్ల కోసం ఈ ఏడాది ఈసెట్ కు 23 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

TS ECET

TS ECET Counseling : తెలంగాణలో జులై 29 నుంచి టీఎస్ఈసెట్ కౌన్సెలింగ్ జరగనుంది. బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ఈసెట్ తొలి విడత ప్రక్రియ ప్రారంభం కానుంది. పాలిటెక్నిక్ తోపాటు బీఎస్సీ మ్యాథ్స్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు.

ఆగస్టు 20వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 175 కాలేజీల్లో ఉన్న 11 వేలకు పైగా సీట్ల కోసం ఈ ఏడాది ఈసెట్ కు 23 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 22 వేల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాశారు. వీరిలో 20,899 మంది ఉత్తీర్ణత సాధించారు.

IBPS Clerk 2023 Notification : డిగ్రీ పాస్ అయితే చాలు ప్రభుత్వ ఉద్యోగం.. బ్యాంకుల్లో 4వేల ఉద్యోగాలు, ఎంపిక ప్రక్రియ-అర్హతలు ఇవే

రెండు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 26 నుంచి 30 తేదీ వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి. ఆగస్టు 28వ తేదీన స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. గతేడాది ఈసెట్ లో 11 వేలకు పైగా సీట్లు ఉండగా, 10 వేల సీట్లు భర్తీ అయ్యాయి.