Sagar Power Generation : నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి నిలిపి వేసిన తెలంగాణ

నాగార్జునసాగర్ వద్ద జలవిద్యుదుత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. జూన్ 29 నుంచి అక్కడ జలవిద్యుదుత్పత్తిని ప్రారంభించిన జెన్‌కో 11 రోజుల్లో 3 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది.

Power Generation In Nagarjuna Sagar: నాగార్జునసాగర్ వద్ద జలవిద్యుదుత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. జూన్ 29 నుంచి అక్కడ జలవిద్యుదుత్పత్తిని ప్రారంభించిన జెన్‌కో 11 రోజుల్లో 3 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది.
తెలంగాణ రాష్ట్రం జల విద్యుదుత్పత్తి చేయటం ప్రారంభించటంతో రెండు రాష్ట్రాలమధ్య జగడం మొదలయ్యింది. రెండు రాష్ట్రాలు ప్రాజెక్టుల వద్ద భారీగా పోలీసులను మొహరించాయి.

తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుల్లో నీటిమట్టం తక్కువగా ఉన్నా తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని..తద్వారా నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని ఏపీ రాసిన లేఖలో పేర్కోంది. ఏది ఏమైనా జలవిద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం పోలీసుల పహరా మధ్య విద్యుదుత్పత్తి చేసింది.

సాగర్ లో నీటి మట్టం తగ్గిపోవటంతో  జెన్‌కో అధికారుల విద్యుదుత్పత్తిని ఆపివేయాలని ఆదేశించారు.  కాగా…. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం వరద నీరు రావటం నిలిచిపోయింది.  ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా .. ప్రస్తుతం 529.20 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు. ఇప్పుడు 166.5892 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.  కాగా, ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో నిల్‌గా ఉంది. 18,246 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది.

కృష్ణా జలాల కేటాయింపులపై ఈనెల 24న జరిగే కేఆర్ఎంబీ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య పలుమార్లు జలవివాదాలపై చర్చలు జరిగాయి. మరోసారి జరిగే సమావేశంలో ఎటువంటి అంశాలపై చర్చలు జరుగుతాయో వేచి చూడాలి.

ట్రెండింగ్ వార్తలు