నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

మొత్తం 11,062 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు డీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తారు. డీఎస్సీ దరఖాస్తు రుసుం రూ.1,000 ఉంటుంది. ఆన్‌లైన్ పద్ధతిలో డీఎస్సీ నిర్వహిస్తారు. పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు. డీఎస్సీ దరఖాస్తుకు అభ్యర్థుల వయోపరిమితి 46 ఏళ్లు.

పోస్టుల వివరాలు

  • సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)-6,508
  • స్కూల్ అసిస్టెంట్-2,629
  • లాంగ్వేజ్ పండిట్-727
  • పీఈటీలు-182
  • ప్రత్యేక కేటగిరీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్లు- 220
  • ఎస్జీటీలు- 796

టీచర్ల నియామకాలకు గత ఏడాది ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం నిన్న రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో 5,089 టీచర్‌ పోస్టులకు బీఆర్ఎస్ సర్కారు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ డీఎస్సీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారు కొత్తగా మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ డాలీ చాయ్ వాలా వద్దకు కుబేరుడు బిల్‌గేట్స్

ట్రెండింగ్ వార్తలు