D. Prabhakar Rao
CMD D. Prabhakar Rao Resign : తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగారు. రాష్ట్రంలో 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ప్రభాకర్ రావు 22 ఏళ్ల వయసులోనే విద్యుత్ శాఖలో చేరారు. 2014, జూన్ 5న జెన్‌కో సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు.
అదే ఏడాది అక్టోబర్ 25న ట్రాన్స్‌కో ఇంచార్జీగా నియమితులయ్యారు. ప్రభుత్వం మొదటగా ఆయన్ను రెండేళ్ల పదవీ కాలానికి సీఎండీగా నియమించింది. తర్వాత ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూవస్తోంది. తాజాగా ఆయన తన సీఎండీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 54 ఏళ్లపాటు సంస్థకు ఆయన సేవలు అందించారు.