TSPSC: నియామక పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. రీ-షెడ్యూల్డ్ తేదీలు ఇవిగో..

TSPSC: పలు నియామక పరీక్షల తేదీలు మారాయి. ఈ మేరకు TSPSC వివరాలు తెలిపింది.

TSPSC

TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నియామక పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించింది. ఈ నెల 23న జరగాల్సిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఎగ్జామ్ జూన్ 28న నిర్వహిస్తామని తెలిపింది. అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ మే 16కి వాయిదా పడింది. ఈ పరీక్ష ఈ నెల 25న జరగాల్సిన ఉన్న విషయం తెలిసిందే.

ఇక గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ గెజిటెడ్ పోస్టుల ఎగ్జామ్ జూలై 18,19న నిర్వహిస్తారు. ఈ పరీక్షను ముందుగా ఈ నెల 26, 27న నిర్వహించాలని అనుకున్నారు. తేదీలు మారాయి. అలాగే, మే 7న నిర్వహించాలనుకున్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎగ్జామ్ మే 19కి వాయిదా పడింది.

ఇక గ్రౌండ్ వాటర్ లో నాన్ గెజిటెడ్ పోస్టుల ఎగ్జామ్ జూలై 20, 21న నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నియామక పరీక్షలపై ప్రకటన చేసింది. కొన్ని రోజులుగా టీఎస్పీఎస్సీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఇవాళ పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

TSPSC

Telangana elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ