TSRTC: మరోసారి డీజిల్ సెస్ పెంచిన తెలంగాణ ఆర్టీసీ

తెలంగాణ ఆర్టీసీ మరోసారి డీజిల్ సెస్ పెంచేసింది. దీంతో తెలంగాణ బస్సుల్లో ప్రయాణించే వారికి ఛార్జీల బాదుడు మరోసారి పెరిగినట్లే. బుధవారం డీజిల్ సెస్ పెంచుతున్నట్లుగా ప్రకటించడంతో ప్రయాణ కొత్త ఛార్జీల వివరాలిలా ఉన్నాయి.

TSRTC: మరోసారి డీజిల్ సెస్ పెంచిన తెలంగాణ ఆర్టీసీ

Tsrtc

Updated On : June 8, 2022 / 10:20 PM IST

TSRTC: తెలంగాణ ఆర్టీసీ మరోసారి డీజిల్ సెస్ పెంచేసింది. దీంతో తెలంగాణ బస్సుల్లో ప్రయాణించే వారికి ఛార్జీల బాదుడు మరోసారి పెరిగినట్లే. బుధవారం డీజిల్ సెస్ పెంచుతున్నట్లుగా ప్రకటించడంతో ప్రయాణ కొత్త ఛార్జీల వివరాలిలా ఉన్నాయి.

ప‌ల్లెవెలుగు సర్వీసుల్లో- 250 కి.మీ దూరానికి రూ.5 నుంచి 45 రూపాయల పెంపు.

ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో- 500 కి.మీ వరకు దూరానికి రూ.5 నుంచి రూ.90,

డీల‌క్స్‌ సర్వీసుల్లో- 500 కి.మీ వరకు దూరానికి రూ.5 నుంచి రూ.125,

సూప‌ర్ ల‌గ్జ‌రీ సర్వీసుల్లో- 500 కి.మీ వరకు దూరానికి రూ.10 నుంచి రూ.130,

ఏసీ స‌ర్వీసులు సర్వీసుల్లో- 500 కి.మీ వరకు దూరానికి రూ.10 నుంచి రూ.170, పెంపు.

Read Also : ప్రజాప్రతినిధులు బస్సుల్లో ప్రయాణించాలన్న మంత్రి పువ్వాడ
ఇందులో హర్షించదగ్గ విషయమేమిటంటే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే డీజిల్ సెస్ పెంపులేదని డేటా చెబుతుంది. దీంతో గ్రేటర్ బస్సుల్లో ప్రయాణించే ఈ ప్రయాణికులకు ఎలాంటి ప్రభావం ఉండదు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw