TSRTC : బస్సుల రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు గమ్యం యాప్.. మహిళల భద్రత కోసం ప్రత్యేక ఫీచర్లు

టీఎస్ఆర్టీసీలో 8,571 బస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెండు నెలల క్రితం 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం అందించింది.

TSRTC Gamyam App : సాంకేతికతను ఉపయోగించి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ కృషి చేస్తోంది. ఆర్టీసీ పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు కొత్త సదుపాయం కల్పించింది. బస్సును ట్రాక్ చేసేలా గమ్యం యాప్ తో అనుసంధానం చేయాలని రాష్ట్రంలోని అన్ని డిపోలకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం టీఎస్ఆర్టీసీలో 8,571 బస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెండు నెలల క్రితం 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం అందించింది. కానీ, ఆర్టీసీ సంస్థ ఆశించిన స్పందన రాకపోవడంతో ఆదాయం పెరగలేదు. దీనికి కారణం మొత్తం బస్సుల్లో సగానికి పైగా సాధారణ బస్సులే ఉండటం.

TSRTC : టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రాయితీ

పల్లె వెలుగు బస్సులు 3,107, సిటీ ఆర్డినరీ 1,569 మొత్తం 4,676 సాధారణ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులకు పరికరాలు అమర్చే ప్రక్రియ ప్రారంభమైంది. గమ్యం యాప్ లో ప్రత్యేకంగా మహిళల భద్రతకు సంబంధించి ఫీచర్లు ఉండటం శుభ పరిణామంగా చెప్పవచ్చు.

ట్రెండింగ్ వార్తలు