Medaram Fair: మేడారం భక్తులు 30 మంది వుంటే నేరుగా ఇంటికే ఆర్టీసీ బస్సు

మేడారం జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి 3845 బస్సు సర్వీసులు వేసినట్టు ఆయన తెలిపారు. ఒకే ప్రాంతంలో 30 మంది ప్రయాణికులు ఉంటే నేరుగా ఇంటికే ప్రత్యేక బస్సు

Medaram Fair: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి..ఆర్టీసీని గాడిలో పెట్టాలని భావిస్తున్న టీఎస్ ఆర్టీసీ.. ఆమేరకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను ఏర్పటు చేసింది టీఎస్ఆర్టీసీ. ఆర్టీసీ ఈడీ మునీశ్వర్ సోమవారం హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. మేడారం జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి 3845 బస్సు సర్వీసులు వేసినట్టు ఆయన తెలిపారు. ఈ సీజన్లో 21 లక్షల మందిని తరలించడమే లక్ష్యంగా ఆర్టీసీ యంత్రాంగం పనిచేస్తుందని మునీశ్వర్ తెలిపారు. మేడారం చేరుకునేందుకు ఒకే ప్రాంతంలో 30 మంది ప్రయాణికులు ఉంటే నేరుగా ఇంటికే ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

Also read: Vuyyuru Crime: ఉయ్యూరులో వ్యక్తిపై హత్యాయత్నం ఘటనలో నిందితుడు అరెస్ట్

మొత్తం 51 పాయింట్స్ నుండి మేడారంకు బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఇతర జిల్లాలకు చెందిన బస్సులను కూడా వరంగల్ – మేడారం మధ్య నడుపుతున్నారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 30 పాయింట్స్ నుండి ప్రయాణికులను మేడారం తరలించేందుకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. వేరువేరు ప్రాంతాల నుండి వరంగల్ కు చేరుకున్న వారు, హనుమకొండ నుండి మేడారంకు సురక్షితంగా చేర్చే విదంగా బస్సు సర్వీస్ కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ మునీశ్వర్ తెలిపారు. మేడారంలో భక్తులను జంపన్న వాగుకు తరలించడానికి తొలిసారిగా ఆర్టీసీ ఆధ్వర్యంలో మినీ బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో, 42 బస్సు క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు.

Also read: TDP MP Kanakamedala: రాజ్యసభలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ ఎంపీ కనకమేడల

ట్రెండింగ్ వార్తలు