×
Ad

Heavy Rains In Telangana : తెలంగాణలో మరో రెండు రోజులు వానలు.. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో మరో రెండు రోజులు వానలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

  • Published On : October 14, 2022 / 12:42 PM IST

Heavy rains in Telangana

Heavy Rains In Telangana : తెలంగాణలో మరో రెండు రోజులు వానలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్‌, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Srisailam Project Flood Water : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. 10 గేట్లు ఎత్తివేత

కాగా, రేపు వరంగల్‌, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. దీంతోపాటు రాష్ట్రంలోని చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురిచే అవకాశముందని పేర్కొంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.