Srisailam Project Flood Water : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. 10 గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో అధకారులు 10 గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

Srisailam Project Flood Water
Srisailam Project Flood Water : ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో అధకారులు 10 గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టుకు మరోసారి భారీగా వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు 2.15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది.
దీంతో అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.07 మీటర్ల వద్ద నీరు ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.65 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 8.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3,60,802 క్యూసెక్కుల నీరు వస్తోంది.
Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 3,85,809 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 215.32 టీఎంసీల నీరు ఉంది. కుడి, ఎడమ విద్యుత్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.