Shock To BRS : ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు భారీ షాక్.. మరో ఇద్దరు నేతలు రాజీనామా

ఇటీవల రాజేష్ బాబు బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్నాడు.

Rajesh Babu Resigned From BRS

Two Leaders Resigned From BRS : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, బాసర ఎంపీపీ రాజీనామా చేశారు. నిర్మల్ జిల్లాలో గులాబీ పార్టీకి షాక్ తగిలింది. బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. ఆయతోపాటు మరో 200 మంది అనుచరులు రాజీనామా చేశారు.

ఇటీవల రాజేష్ బాబు బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్నాడు. పలుమార్లు అగ్రనేతలు బిజ్జగించినా రాజేష్ బాబు మనసు మార్చుకోలేదు. ముధోల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డిని మార్చాలని పట్టుబట్టారు.

Ponguleti Srinivasa Reddy : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి- పొంగులేటి శ్రీనివాస రెడ్డి

అధిష్టానం పట్టించుకోక పోవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నిస్తామని రాజేష్ బాబు స్పష్టం చేశారు. రాజేష్ బాబుతో పాటు బాసర ఎంపీపీ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే లంచగొండి తనం, అసమర్థత, కుల పిచ్చి, అణచివేత ధోరణిని సహించలేక రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.