Ameenpur
Guns in Ameenpur: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు తుపాకీతో తిరుగుతూ కలకలం సృష్టించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఉదయం అమీన్‌పూర్ పీఎస్ పరిధిలో ఇద్దరు వ్యక్తుల వద్ద తుపాకీ ఉండడం గమనించిన స్థానికులు..వారిని అడ్డగించి ఘెరావ్ చేశారు. పొంతనలేని సమాధానాలు చెబుతూ వారిద్దరూ స్థానికులతో దురుసుగా ప్రవర్తించడంతో..స్థానికులు మూకుమ్మడి దాడి చేశారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అమీన్‌పూర్ పోలీసులు స్థానికులను వారించి..గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల చేతిలో గాయపడిన వారు బంజారాహిల్స్ కు చెందిన మొహమ్మద్ జావిద్ (30) చంద్రాయణ గుట్టకు చెందిన మొహమ్మద్ వాజీద్(32)గా పోలీసులు గుర్తించారు.
Also read:Hyd Drugs Case: మత్తు దందా కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
తమ వద్దనున్న గన్ కు లైసెన్స్ ఉందంటూ జావిద్ పేర్కొనగా..లైసెన్స్ పై ఆరా తీసిన పోలీసులు..లైసెన్స్ నం.283గా నిర్ధారించారు. హైదరాబాద్ నుండి ప్లాట్ల కొనుగోలు చేయడానికి ఈ ప్రాంతానికి వచ్చినట్లు జావీద్ పేర్కొన్నాడు. స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు భూములు చూడ్డానికి వచ్చామని బాధితులు వాపోగా..ఇస్లాపూర్ తండా సర్పంచి రవిని హత్య చేయడానికే ఇద్దరు వ్యక్తులు వచ్చారంటూ గ్రామస్థుల ఆరోపించి వారిపై దాడికి పాల్పడ్డారు. ఈఘటనపై అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గన్ కు లైసెన్స్ ఉన్నా ఇలా పబ్లిక్ లో ప్రదర్శించి ప్రజలను భయాందోళనకు గురిచేయడం నేరమే అవుతుందని పోలీసులు పేర్కొన్నారు.
Also Read:Young Lady Suicide: ఈఎస్ఐ మెట్రొ స్టేషన్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య