Road Accident Two Killed : ప్రాణం తీసిన అతి వేగం.. స్తంభాన్ని బైక్ ఢీకొని ఇద్దరు మృతి

హైదరాబాద్ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ROAD ACCIDENT

Road Accident Two Killed : అతి వేగం ఇద్దరి నిండు ప్రాణాలు తీసింది. హైదరాబాద్ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. హయత్ నగర్ మండలం పసుమాముల దగ్గర అత్యంత వేగంగా దూసుకొచ్చిన బైక్ అదుపు తప్పి స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.

దీంతో బైక్ పై వెళ్తోన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులను అనూష, హరికృష్ణగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Road Accident Two Dead : బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అయితే ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. వేగంగా వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.