R0AD ACCIDENT
Road Accident Two Died : మెదక్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులపై కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారు జామున 5 గంటలకు పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు ఊడ్చుతున్నారు. అదే సమయంలో రాందాస్ చౌరస్తా నుంచి వేగంగా వచ్చిన టీఎస్35ఎఫ్ 9766 నెంబర్ గల కారు ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద కార్మికులపైకి దూసుకెళ్లింది.
దీంతో దాయర వీధికి చెందిన నర్సమ్మ అనే కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో కార్మికురాలు యాదమ్మను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ సైదులు, పట్టణ సీఐ మధు, రూరల్ సీఐ విజయ్ కుమార్, ఎస్ఐలు మల్లారెడ్డి, విఠల్ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.
Road Accident Two Died : వైద్య పరీక్షలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. బాలింత, వృద్ధుడు దుర్మరణం
గాయపడ్డ మరో ముగ్గురు కార్మికులను ఆస్పత్రికి తరలించారు. ఒకేసారి ఇద్దరు మున్సిపల్ కార్మికులు మరణించడంతో మెదక్ మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కార్మికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.