Udaipur Kanhaiya Lal Case
Udaipur Kanhaiya Lal Case : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రాజస్తాన్ ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్ లాల్ హత్య కేసు విచారణలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ కేసులో హైదరాబాద్ లింకు బయటపడింది. ఆ దిశగా ఎన్ఐఏ విచారణ చేస్తోంది. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు పాతబస్తీలో పర్యటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
Udaipur: ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత.. ఆందోళనకారులను అదుపు చేసిన పోలీసులు
ఇద్దరు నిందితులు మహమ్మద్ గౌస్, వాసిమ్ అట్టారి గతంలో నగరంలో పర్యటించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. 2017-18లో పాతబస్తీకి వచ్చిన నిందితులు ఎక్కడ ఉన్నారు? ఏం చేశారు? అని ఆరా తీశారు. పాకిస్తాన్ లోని కరాచీ నుంచి పని చేస్తున్న దావత్ ఈ ఇస్లామియా సంస్థ పని కోసం మహమ్మద్ గౌస్, వాసిమ్ అట్టారి హైదరాబాద్ లో పర్యటించినట్లు తెలిసింది. వారిద్దరూ సంతోష్ నగర్ ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నారని ఎన్ఐఏ అధికారులు వివరాలు సేకరించారు.
Udaipur Murder : ఉదయ్ పూర్ నిందితులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్ధతో లింకులు
నుపుర్ శర్మ వ్యాఖ్యల తర్వాత హైదరాబాద్ కు చెందిన కొందరు.. టైలర్ కన్హయ్య హత్యకు కుట్ర పన్నారంటూ ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది. పాతబస్తీలో ఉన్న మతప్రబోధకుడు వీరిని ప్రేరేపించినట్లు అధికారులు చెబుతున్నారు. బీహార్ కు చెందిన మునావర్ హుస్సేన్ అస్రాఫీ(36) ను నిన్న ఎన్ఐఏ అధికారులు విచారించారు. నుపుర్ శర్మ వ్యాఖ్యల తర్వాత మునావర్ ప్రబోధనలతో రెచ్చిపోయిన నిందితులు కన్హయ్య లాల్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని మునావర్ కు నోటీసులు జారీ చేశారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
బీహార్ లోని బాగల్ పూర్ కి చెందిన మునావర్.. హైదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖలందర్ నగర్ లో ఇస్లామిక్ సెమినారీ, టాహీద్ కేంద్రాన్ని నడిపిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా మునావర్ హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఇక్కడి నుంచి మత ప్రబోధనలు చేస్తున్నాడు. ఎన్ఐఏ అధికారులు మునావర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. టైలర్ హత్య కేసులో నిందితుడు అయిన వాసిమ్ ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా మునావర్ తో ఉన్న సంబంధాన్ని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
Udaypur Murder : ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్‌లాల్ హత్యఘటన..32 మంది సీనియర్ ఐపీఎస్ లు బదిలి