Udaypur Murder : ఉద‌య్‌పూర్‌లో టైల‌ర్ క‌న్హ‌య్‌లాల్ హ‌త్యఘటన..32 మంది సీనియ‌ర్ ఐపీఎస్ లు బదిలి

రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో టైల‌ర్ క‌న్హ‌య్‌లాల్ హ‌త్య కేసు జరిగిన నేపథ్యంలో 32మంది ఐపీఎస్‌ల‌ను బ‌దిలీ అయ్యారు. గురువారం (జూన్ 30,2022) అర్థరాత్రి డిపార్ట్ మెంట్ జారీ చేసిన బాబితాలో ఉదయపూర్ సహా 10 జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు.

Udaypur Murder : ఉద‌య్‌పూర్‌లో టైల‌ర్ క‌న్హ‌య్‌లాల్ హ‌త్యఘటన..32 మంది సీనియ‌ర్ ఐపీఎస్ లు బదిలి

Udaipur Tailor Murder Case

Udaipur Tailor Murder Case  : రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో టైల‌ర్ క‌న్హ‌య్‌లాల్ హ‌త్య కేసు జరిగిన నేపథ్యంలో 32మంది ఐపీఎస్‌ల‌ను బ‌దిలీ అయ్యారు. గురువారం (జూన్ 30,2022) అర్థరాత్రి డిపార్ట్ మెంట్ జారీ చేసిన బాబితాలో ఉదయపూర్ సహా 10 జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు.ఈ హత్య ఘటన తరువాత పోలీసుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఉదయపూర్ పోలీస్ సూపరింటెంబెంట్ గా మనోజర్ కుమార్ స్థానంలో వికాస్ కుమార్ నియమితులయ్యారు. వికాస్ గతంలో అజ్మీర్ ఎస్పీగా పనిచేశారు. ఉదయపూర్ ఐజీగా ప్రపుల్ల కుమార్ నియంతులయ్యారు. గతంలో ప్రపుల్ల కుమార్ ఏటీఎస్ ఐజీగా ఉన్నారు.ఉదయపూర్ఐజీ హింగల్ జాదన్ కు కూడా తొలగించి పౌర హక్కుల ఐజీగా నియమించారు.

బీజేపీ నేత నుపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల‌కు సోషల్ మీడియాలో మ‌ద్ద‌తు తెలిపిన టైల‌ర్ క‌న్హ‌య్య‌ను ఇద్ద‌రు వ్య‌క్తులు హత్య చేసిన విషయం తెలిసిందే.ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. ఈ కేసులో రియాజ్ అక్తారీ, గౌస్ మొహ‌మ్మ‌ద్‌ల‌ను అరెస్టు చేశారు. ఈ కేసును జాతీయ ద‌ర్యాప్తు ఏజెన్సీకి అప్ప‌గించారు. పాక్‌లోని దావ‌త్ ఏ ఇస్లామీ గ్రూపుతో హంత‌కుల‌కు సంబంధాలు ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు.

ఉద‌య్‌పూర్ ఘ‌ట‌న‌ను ఉగ్ర‌వాద చ‌ర్య‌గా భావిస్తున్న రాజ‌స్థాన్ పోలీస్ చీఫ్ ఎంఎల్ లాథ‌ర్ తెలిపారు. ఇద్ద‌రు నిందితుల‌ను గురువారం కోర్టుముందు హాజ‌రుప‌రిచారు. ఆ ఇద్ద‌ర్నీ 14 రోజుల పాటు జుడిషియ‌ల్ కస్ట‌డీలోకి తీసుకున్నారు. క‌న్హ‌య్య‌లాల్‌ను త‌ల‌ను న‌రికిన నిందితులు ఆ ఘ‌ట‌న‌ను షూట్ చేశారు. ఓ వీడియోలో ప్ర‌ధాని మోడీని కూడా వాళ్లు బెదిరించారు. ఈ వీడియోలో తమను తాము రియాజ్ అక్తరీ, గౌస్ మహ్మద్ లుగా వెల్లడించారు. వీరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.