Hyderabad : తండ్రి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య

తండ్రి మరణం తట్టుకోలేని కుమారుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఫలక్ నుమ పోలీస్ స్టేషన్ పరిధిలోని జహ్నుమ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Hyderabad

Hyderabad : తండ్రి మరణం తట్టుకోలేని కుమారుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని జహ్నుమ ప్రాంతంలో చోటుచేసుకుంది. 34 ఏళ్ల ఉస్మాన్ అలీ ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని మృతి చెందాడు. తండ్రి మరణించిన రెండు రోజులకే కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరినీ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.