Kondagattu Bride Kidnap : కొండగట్టులో ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్తుండగా.. వరుడిని చితకబాది వధువును కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

హన్మకొండ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన వధువు, వరంగల్ కు చెందిన వరుడు కరీంనగర్ జిల్లాలోని కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు.

Bride Kidnap

Bride Kidnapped : కరీంనగర్ జిల్లాలోని కొండగట్టులో నవ వధువు కిడ్నాప్ కలకలం రేగింది. హుజూరాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. హన్మకొండ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన వధువు, వరంగల్ కు చెందిన వరుడు కరీంనగర్ జిల్లాలోని కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు.

అయితే పెళ్లి చేసుకుని వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వరుడిని చితకబాది వధువును కారులో ఎత్తుకెళ్లారు. వధువును కిడ్నాప్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Hayath Nagar Child Died : హైదరాబాద్ హయత్ నగర్ లో విషాదం.. నిద్రిస్తున్న పాప తలపై నుంచి కారు వెళ్లడంతో చిన్నారి మృతి

కాగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని హుజూరాబాద్ పోలీసులు అంటున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.