Khammam
Sai Ganesh Suicide : తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడానికి కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. ఏ అవకాశం వచ్చినా వదలడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలకు దిగుతోంది. బీజేపీ నేతలు చేసే విమర్శలు, ఆరోపణలకు గులాబీ దళం ధీటుగా కౌంటర్ ఇస్తోంది. ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ఖమ్మం, రామాయంపేటలో జరిగిన ఆత్మహత్యల ఘటలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఖమ్మం జిల్లా ఘటనలో ఏకంగా సెంటర్ సైతం ఎంట్రీ ఇచ్చేసింది.
Read More : Bandi sanjay : మంత్రిపై హత్య కేసు నమోదు చేయాలి: బండి సంజయ్
ఇప్పటికే సాయిగణేష్ కుటుంబ సభ్యులతో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. 2022, ఏప్రిల్ 20వ తేదీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు బీజేపీ నేతలు. పాదయాత్ర ప్రారంభం స్థలిలోనే నిరసన దీక్ష చేపట్టారు బండి సంజయ్. ఖమ్మం ఘటనపై ఉద్యమాన్ని బీజేపీ ఉధృతం చేస్తోంది. బీజేపీ కార్యకర్త ఏకంగా కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి.. ఖమ్మం జిల్లాలో పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఖమ్మం జిల్లాకు రానున్నారు. గురువారం ఖమ్మం జిల్లాకు ఎంపీ సోయం బాబు రావు, ఎల్లుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు రానున్నారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఘటనపై సీబీఐ విచారణ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తోంది.