Amit shah: అమిత్ షా ఖమ్మం టూర్ ఖరారు.. భారీ బహిరంగ సభ నిర్వహణకు తెలంగాణ బీజేపీ కసరత్తు

కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఖమ్మం టూర్ ఖరారైంది. గత నెల 15న ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన బహింరంగ సభలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అనివార్య కారణాలవల్ల అమిత్ షా పర్యటన వాయిదా పడింది. అయితే, ఈ నెల 29న అమిత్ షా ఖమ్మం పర్యటన ఖారారైంది.

Amit Shah

Amit shah: కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah)  ఖమ్మం జిల్లా (Khammam District) పర్యటన ఖరారైంది. ఈనెల 29న అమిత్ షా ఖమ్మం రానున్నారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభ (Public Meeting) లో పాల్గొని ప్రసంగిస్తారు. అయితే, ఏ సమయానికి కేంద్ర మంత్రి ఖమ్మం టూర్ ఉంటుందనేది ఖరారు కావాల్సి ఉంది. గతనెల 15న అమిత్ షా ఖమ్మం పర్యటనకు రావాల్సి ఉంది. తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ, గుజరాత్‌‌తోపాటు, పలు రాష్ట్రాల్లో తుఫాన్ కారణంగా అమిత్ షా ఖమ్మం పర్యటన వాయిదా పడింది. షా పర్యటన వాయిదా పడటంతో బీజేపీ శ్రేణులకు కొంత నిరాశకు గురయ్యారు. తాజాగా ఈనెల 29న అమిత్ షా ఖమ్మం పర్యటన ఖరారు కావటంతో భారీ బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తోంది.

Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా.. బండి సంజయ్ ఏమన్నారంటే..?

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ పగ్గాలను కేంద్ర పార్టీ అధిష్టానం అప్పగించింది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలకు కీలక పదవులు అప్పగించింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గద్దెదించే సత్తా తమకే ఉందని బీజేపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ వంద రోజుల కార్యాచరణను ఖరారు చేసింది. ప్రజల్లోనే ఉంటూ విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా అందుకు సిద్ధంగా ఉండేందుకు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా ఖమ్మం టూర్ బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపే అవకాశాలు ఉన్నాయి.

Minister Amit shah: అమిత్ షాతో మంత్రి కేటీఆర్ భేటీ రద్దు.. కారణమేమంటే?

ఇదిలాఉంటే.. గత నెల 15న ఖమ్మంలో పర్యటన సందర్భంగా అమిత్ షా పలు రంగాల ప్రముఖులను కలిసేందుకు నిర్ణయించారు. ముఖ్యంగా సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావాల్సి ఉంది. అయితే, అమిత్ షా పర్యటన వాయిదా పడింది. ఈనెల 29న అమిత్ షా పర్యటన ఖరారు కావడంతో ఈసారి సినీ రంగ ప్రముఖులతో ఎవరితోనైనా అమిత్ షా భేటీ ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.